కళ్యాణ్ బాబు ఆ రోజు ఫోన్ చేశాడు తెల్లారే కల్లా పార్టీలో చేరిపోయా అంటున్న నాగబాబు..!

కళ్యాణ్ బాబు ఆ రోజు ఫోన్ చేశాడు తెల్లారే కల్లా పార్టీలో చేరిపోయా అంటున్న నాగబాబు..!

కళ్యాణ్ బాబు ఆ రోజు ఫోన్ చేశాడు తెల్లారే కల్లా పార్టీలో చేరిపోయా అంటున్న నాగబాబు..!
 
ఆంధ్రప్రదేశ్ రెండో సార్వత్రిక ఎన్నికలకు నెలరోజులు ముందు జనసేన పార్టీ లో ఎంటర్ అయిన నాగబాబు..అసలు పాలిటిక్స్ లో ఎందుకు వచ్చారో ఇటీవల సంచలన విషయం బయటపెట్టారు. అసలు రాజకీయాల్లో రాకూడదని కేవలం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాత్రమే ఉండాలని ముందు నిర్ణయం తీసుకున్నానని ...ఇందుమూలంగా నే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వీడియో లు చేస్తూ తన వంతు కృషి చేశారని తెలిపిన నాగబాబు...అసలు ఎన్నికలకు నెల రోజుల ముందు జరిగిన విషయం బయటపెట్టారు.
 
ఒకరోజు "పవన్ కల్యాణ్ సడన్ గా పిలిచి జనసేన పార్టీ తరఫున నరసాపురం నుంచి పోటీచేయడంపై నీ అభిప్రాయం ఏంటి? అని అడిగాడు. ఒక్కసారిగా అలా అడగడంతో కంగారుపడిపోయాను. ఏంచెప్పాలో తోచలేదు. దాంతో, 12 గంటల టైమ్ అడిగాను. చివరికి ఎప్పుడో తెల్లవారుజామున నిర్ణయం తీసుకుని అప్పుడు ఓకే చెప్పాను. కానీ, అంత సమయం ఎందుకు తీసుకున్నానో అర్థం కాలేదు. తమ్ముడు ఎంతో నమ్మకంతో అడిగితే, 12 గంటల సమయం అడిగి తప్పు చేశానా అనిపించింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల పుణ్యమా పవన్ కళ్యాణ్ తో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికిందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు నాగబాబు.Top