వైసీపీ పార్టీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్ర టిడిపి నేతలతో నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు చంద్రబాబు. ముఖ్యంగా ఎన్నికల అయిపోయిన తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేసిన చంద్రబాబు తాజాగా వైసీపీ పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానంపై సరికొత్త కామెంట్ చేశారు. అర్థం పర్థం లేని వ్యాఖ్యలతో చంద్రబాబు ఏపీ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా టిడిపి గెలుస్తుందని చెబుతూనే టిడిపిలో గెలిచేవారితో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. టెలికాన్ఫరెన్స్ లీక్ గా ఈ విషయం మీడియాలో ప్రసారం చేయించారు. ఇలాంటి కుట్రలను ఆదారాలతో బయటపెట్టాలని ఆయన సూచించారు. ఆయనకే ఆ విషయం తెలిసినప్పుడు ఎవరో బయటపెట్టడం ఎందుకు? ఆయనే ఎవరెవరితో ఎవరు టచ్ లోకి వెళ్లారో చెబితే పోతుంది కదా...అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విన్న కొంతమంది రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు.