అసలు మార్పు ఇప్పుడే మొదలైంది అంటున్న జేడీ లక్ష్మి నారాయణ…!

Written By Siddhu Manchikanti | Updated: May 03, 2019 09:46 IST
అసలు మార్పు ఇప్పుడే మొదలైంది అంటున్న జేడీ లక్ష్మి నారాయణ…!

అసలు మార్పు ఇప్పుడే మొదలైంది అంటున్న జేడీ లక్ష్మి నారాయణ…!
 
ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరి అందరికి షాక్ ఇచ్చారు జేడీ లక్ష్మీనారాయణ. వైసీపీ పార్టీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలకంగా వ్యవహరించిన జేడీ లక్ష్మి నారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా ఒప్పుకోవడంతో అప్పట్లో ఎన్నికలను జరగక ముందు ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థిగా జేడీ లక్ష్మీనారాయణ విశాఖపట్టణం లోక్సభ స్థానం నుండి పోటీ చేశారు.
 
ఈ క్రమంలో జె డి లక్ష్మీనారాయణ గాజువాకలో జరిగిన సమావేశంలో గాజువాక గ‌డ్డ జ‌న‌సేన అడ్డాగా మారిపోయిందని ప్ర‌జ‌లు చెబుతున్నారని చెప్పారు.కేవ‌లం 25 రోజుల్లో రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చాం. మ‌నం సూర్యుడు ఉద‌యించిన‌ప్పుడు ధైర్యంగా ప్ర‌చారం చేస్తే .. మిగ‌తా పార్టీలు అర్ధ‌రాత్రి డ‌బ్బు సంచుల‌తో ప్ర‌చారం చేశాయి. జ‌న‌సేన పార్టీ త‌మ పార్టీ అని ప్ర‌జ‌లు న‌మ్మారు. అందుకు త‌గ్గ‌ట్టే మ‌న‌ మ్యానిఫెస్టో ప్ర‌జ‌లమ‌ధ్య త‌యారైంది. కొత్త ఆలోచ‌న‌లు, కొత్త విధానాల‌తో జ‌న‌సేన పార్టీ ముందుకు తీసుకెళ్ల‌డంతో పాటు స‌మాజంలో మార్పు తీసుకొద్దాం.
 
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేయాలి. అందుకు ప్ర‌తి ఒక్క జ‌న‌సైనికుడు కృషి చేయాలి. వార్డుల్లో స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వ్వాలి. మ‌న త‌రువాత ల‌క్ష్యం జీవీఎంసీపైజ‌న‌సేన జెండా ఎగిరేలా చేయాలి. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వ‌ర‌కు జ‌న‌సేన జెండా ఎగిరేలా మ‌నం కృషి చేయాలి. గెలుస్తాన‌నే గ‌ర్వం లేదు, ఓడిపోతాన‌న్న భ‌యం లేదు, మార్పు తెస్తాన‌న్న న‌మ్మ‌కం నాలో ఉంది అని జ‌న‌సేనాని చెప్పిన మాట‌ను ప్ర‌జ‌ల్లోకి గ‌ట్టిగా తీసుకెళ్లాల‌ని జ‌న‌సైనికుల‌కు, వీర మ‌హిళ‌ల‌కు పిలుపు ఇచ్చారు.
Top