జగన్ పై మరింత ఫోకస్ పెట్టిన జాతీయ మీడియా చానల్స్…!

Written By Siddhu Manchikanti | Updated: May 03, 2019 09:51 IST
జగన్ పై మరింత ఫోకస్ పెట్టిన జాతీయ మీడియా చానల్స్…!

జగన్ పై మరింత ఫోకస్ పెట్టిన జాతీయ మీడియా చానల్స్…!
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలు అవసరం తధ్యమని సర్వేలు చెబుతున్నా నేపథ్యంలో జాతీయ మీడియా చానల్స్ లో ప్రాంతీయ పార్టీల గురించి రకరకాల కథనాలు వడ్డీ వారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డి అంటే డి అన్నట్టుగా ఉన్న వైసిపి టిడిపి పార్టీ గురించి రకరకాల కథనాలు జాతీయ మీడియా ఛానల్ లో ప్రచారం అవుతున్నాయి. అయితే రాష్ట్రంలో జరుగుతున్న అన్ని స‌ర్వేల‌న్నీ వైసీపీకే జై కొడుతున్నాయి.
 
ఈ క్ర‌మంలో జాతీయ చాన‌ళ్ళ క‌న్ను ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గన్ మోహ‌న్ రెడ్డి పై ప‌డింది. ఈ నేప‌ధ్యంలో ఏపీలో వైసీపీ ప్ర‌భంజ‌నం సృష్టించ‌బోతుంద‌ని, బ‌ల‌మైన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ‌గా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేరు గ‌ట్టిగా విన‌బ‌డుతున్న క్ర‌మంలో తాజాగా మ‌రో జాతీయ చాన‌ల్ జ‌గ‌న్ పై ఫోక‌స్ పెట్టింది. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ చాన‌ల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ ప్ర‌భంజ‌నం సృష్టించ‌నుంద‌ని ఓ స్పెష‌ల్ స్టోరీని ప్ర‌సారం చేసింది. ఈ క్ర‌మంలో ఏపీలో టీడీపీ సర్కార్ పై వ్య‌తిరేక‌త ఏ రేంజ్‌లో ఉంది.. అప్ప‌టికే ఉన్న వైసీపీ ఓటు బ్యాంక్‌కు తోడు, టీడీపీ వ్య‌తిరేక ఓటు కూడా తోడ‌వ‌డంతో వైసీపీకి తిరుగే ఉండ‌ద‌ని ఆ జాతీయ చాన‌ల్ తేల్చి చెప్పింది.
Top