రాహుల్ గాంధీ కి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్..!

Written By Siddhu Manchikanti | Updated: May 03, 2019 09:54 IST
రాహుల్ గాంధీ కి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్..!

రాహుల్ గాంధీ కి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్..!
 
ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రావటానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ పార్టీ పై మరియు మోడీ పై తాజాగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. దీంతో ఎఐసిసి అదినేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం తాకీదు పంపించింది.
 
మోడీ ప్రభుత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గాను ఈ నోటీసు జారీ అయింది. ‘గిరిజనులను కాల్చిపారేసేలా మోదీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది’ అంటూ ఇటీవల ఓ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ పేర్కొన్నారు. రాహుల్ కు నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తూ వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది. మధ్యప్రదేశ్‌ ఎన్నికల అధికారుల నుంచి నివేదిక తీసుకున్న ఈసీ.. రాహుల్‌కు నోటీసు ఇచ్చింది.
Top