కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యే..!

Written By Siddhu Manchikanti | Updated: May 04, 2019 10:07 IST
కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యే..!

కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యే..!
 
బిజెపి పార్టీ ని ఎలాగైనా అధికారంలో నుండి కిందకు దించాలి అని దేశ స్థాయిలో ఉన్న జాతీయ నాయకులతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా తెగ ప్రయత్నాలు జరుపుతున్నారు. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో గెలిచి దేశం మొత్తం తనవైపు తిప్పుకున్న కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి గత కొంత కాలం నుండి తలనొప్పిగా మారిన సంగతి అందరికీ తెలిసినదే. ముఖ్యంగా ప్రస్తుతం దేశ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్ కి సొంత పార్టీ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు.
 
ఇటీవల తమ పార్టీ వారు ఎవరూ పార్టీ మారరు అని ఆమ్ ఆద్మి పార్టీ నేత, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన కొద్ది సేపటికే ఆయన పార్టీ ఎమ్మెల్యే ఒకరు బిజెపి లో చేరడం విశేషం. గాంధీ నగర్‌ ఆప్‌ ఎమ్మెల్యే అనిల్‌ బాజ్‌పేయి కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ నెల పన్నెండున ఎన్నికలు జరగనుండగా,ఆప్ ఎమ్మెల్యే బిజెపిలో చేరడం ఆ పార్టీకి నష్టం కలిగించవచ్చని చెబుతున్నారు.ఆప్ ఎమ్మెల్యేలను బిజెపి కొనలేదని కొంతసేపటి క్రితమే కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే తాజా పరిణామం జరగడంతో ఆమ్ ఆద్మి పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా షాక్ తిన్నట్లు సమాచారం.
Top