ఐ యామ్ బ్యాక్ అంటున్న రేవంత్ రెడ్డి..!

Written By Siddhu Manchikanti | Updated: May 04, 2019 10:12 IST
ఐ యామ్ బ్యాక్ అంటున్న రేవంత్ రెడ్డి..!

ఐ యామ్ బ్యాక్ అంటున్న రేవంత్ రెడ్డి..!
 
తెలంగాణ రాష్ట్రంలో రెండో సార్వత్రిక ఎన్నికలు జరగగా ముందు అధికారంలో కెసిఆర్ కి తలనొప్పిగా మారిన రేవంత్ రెడ్డి తెలంగాణ లో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో కూడా పెద్ద హాట్ టాపిక్ అయ్యారు. ఒక విధంగా తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ నేతలకు చుక్కలు చూపించిన రేవంత్ రెడ్డి. అయితే రెండో సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓడిపోయిన క్రమంలో సైలెంట్ అయిపోయిన రేవంత్ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇంటర్ విద్యార్థుల ఫలితాల అవకతవకల గురించి స్పందిస్తూ టిఆర్ఎస్ పార్టీ కి మరియు పార్టీ పెద్దలకు అయామ్ బ్యాక్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
 
టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ పైన మళ్లీ ఆరోపణలు గుప్పించారు. గ్లోబరీనా సంస్థకు ఇంటర్ బోర్డులో బాద్యతలు అప్పగించడంలో కెటిఆర్ ప్రమేయం ఉందని రేవంత్ ఆరోపించారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకల నేపథ్యంలో మాగ్నటిక్‌ ఇన్ఫోటెక్, గ్లోబరీనా సంస్థల ప్రమేయంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. అక్రమాలు జరిగినట్టు నిరూపించలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అమరవీరుల స్తూపం సహా.. తెరాస నేతలు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు. గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించేంతవరకు కాంగ్రెస్‌ పోరాటం ఆగదని రేవంత్ అన్నారు.
Top