పవన్ కళ్యాణ్ లో ఆ మూడు లక్షణాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి: జేడీ లక్ష్మీనారాయణ…!

Written By Siddhu Manchikanti | Updated: May 04, 2019 10:15 IST
పవన్ కళ్యాణ్ లో ఆ మూడు లక్షణాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి: జేడీ  లక్ష్మీనారాయణ…!

పవన్ కళ్యాణ్ లో ఆ మూడు లక్షణాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి: జేడీ లక్ష్మీనారాయణ…!
 
ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరి అందరికి షాక్ ఇచ్చిన జేడీ లక్ష్మి నారాయణ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జేడీ లక్ష్మినారాయణ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...రాజకీయాల్లోకి అసలు రావటానికి గల కారణం ప్రజలలో మార్పు తీసుకురావాలని వారి ఆలోచనా ధోరణిని మార్చే విధంగా రాజకీయాలు చేయడానికి పాలిటిక్స్ లోకి వద్దామని నిర్ణయం తీసుకున్న సమయంలో మహారాష్ట్ర బదిలీ కావడం అదేసమయంలో జనసేన పార్టీ స్థాపించడం జరిగిందని పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ఎప్పుడూ కలవలేదు కానీ ఈ సంవత్సరం మార్చిలో క‌లిశామ‌ని ల‌క్ష్మీ నారాయ‌ణ తెలిపారు.
 
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అపార‌మైన జ్ఞానం ఉంద‌ని, పుస్త‌క ప‌ఠ‌నం ద్వారా ప్ర‌జ‌లతో మ‌మేక‌మ‌య్యే ధోర‌ణి అపార‌మైన జ్ఞానాన్ని సంపాదించార‌న్నారు. అలాగే ఏపీలో రెండు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ఉన్నా కూడా ఎంతో ధైర్యంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన‌ను స్థాపించార‌న్నారు. అంతేకాకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్ర‌జ‌ల్లో విస్తృత ఆద‌ర‌ణ ఉంద‌న్నారు. ఇలా ఈ మూడు ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తి ఒక్క ప‌వ‌న్ క‌ళ్యాన్ అన్నారు. ఇలాంటి వ్య‌క్తులు మాత్ర‌మే ప్ర‌పంచ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌గ‌ల శ‌క్తి క‌లిగి ఉంటార‌ని జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ అన్నారు.
Top