సంచలన బ్రేకింగ్: ఏపీలో బీజేపీ పార్టీ సర్వే..!

Written By Siddhu Manchikanti | Updated: May 04, 2019 10:19 IST
సంచలన బ్రేకింగ్: ఏపీలో బీజేపీ పార్టీ సర్వే..!

సంచలన బ్రేకింగ్: ఏపీలో బీజేపీ పార్టీ సర్వే..!
 
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కచ్చితంగా జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమని పలు జాతీయ రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ సర్వే చేయించినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ చేయించిన సర్వేలో వైసిపి పార్టీ కి స్పష్టమైన మెజారిటీ ఫలితాలు వచ్చినట్లు సమాచారం.
 
మే 23 త‌రువాత వెలువ‌డ‌నున్న ఫ‌లితాల్లో వైసీపీ త‌క్కువ‌లో త‌క్కువ‌గా 20 నుంచి 23 ఎంపీ సీట్ల‌ను, అలాగే 130 అసెంబ్లీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుందంటూ అమిత్ షా త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేసిన‌ట్టు స‌మాచారం. ఇలా దాదాపు 23 వ‌ర‌కు ఎంపీ స్థానాలు గెలుపొందే అవ‌కాశాలు వైసీపీకే ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో కేంద్రంలో హంగ్ వ‌స్తే ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు త‌ప్ప‌ద‌న భాగంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జగన్తో భేటీ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర మరియు దేశ రాజకీయాల్లో టాప్ వినబడుతోంది.
 
అయితే మరోపక్క జగన్ మాత్రం ఫలితాలు వచ్చిన వెంటనే పార్లమెంటు స్థానాలను బట్టి ఎవరైతే ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని సంతకం పెడతారో వారికి మాత్రమే మద్దతు అన్న ధోరణిలో ఉన్నారని..ఫలితాలు వచ్చే వరకు జాతీయ రాజకీయాలపై ఏ మాత్రం జగన్ దృష్టి పెట్టడానికి ఇష్టపడటం లేదని పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం.
Top