జగన్ ఫ్యాక్షనిస్టు అన్నవారికి భీభత్సమైన కౌంటర్ వేసిన పోసాని కృష్ణ మురళి..!
సినీ నటుడు రచయిత పోసాని వైసిపి పార్టీ అధినేత జగన్ అంటే ఆయన వ్యక్తిత్వం అంటే చాలాసార్లు ఇష్టమని కొన్ని సందర్భాలలో పలు మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లలో కూడా తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వైసిపి పార్టీ రావడం ఖాయమని పలు సర్వేల్లో తేలుతున్న నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల నాయకులు జగన్ అధికారంలోకి వస్తే ఫ్యాక్షన్ గొడవలు జరుగుతాయని కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో పోసాని కృష్ణ మురళి జగన్ ఫ్యాక్షనిస్టు అన్నా వారికి తగిన రీతిలో సమాధానం చెప్పారు.
ముఖ్యంగా గత కొంత కాలం నుండి జగన్ అవినీతిపరుడు అంటూ తండ్రి హయాంలో అవినీతి చేశాడు అని వచ్చిన ఆరోపణలపై పోసాని కృష్ణమురళి స్పందిస్తూ...జగన్ అవినీతి చేసాడు అని ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాటిని నిరూపించాలి కదా అని ప్రశ్నించారు. అలాగే రాయలసీమ ప్రాంతంలో ఎంతో మంది ఫ్యాక్షనిస్టులు ఉన్నారని, కానీ అలాగే జగన్ కుటుంబం విషయానికి వస్తే వారి తాత రాజారెడ్డి కాలం నుంచి ధనికులే అని కానీ జగన్ మాత్రం వాటిని ఎప్పుడు తలకెక్కించుకోలేదని తెలిపారు. వారి కుటుంబం అంతా కలిపి ఒక 800 మంది వరకు ఉండి ఉంటారని కానీ వీరి మీద మాత్రం ఒక్క ఫ్యాక్షన్ కేసు కూడా లేదని అన్నారు. అలాగే జగన్ ఇన్నేళ్ల జీవితంలో కూడా జగన్ పై ఎన్నో అభియోగాలు ఉన్నప్పటికీ ఫ్యాక్షన్ కేసు ఒక్కటి కూడా లేదని ఆకాశానికి ఎత్తేసారు.