మోడీ చరిష్మా చాలు మళ్లీ మాదే అధికారం అని అనడానికి: రామ్ మాధవ్..!

Written By Siddhu Manchikanti | Updated: May 05, 2019 11:10 IST
మోడీ చరిష్మా చాలు మళ్లీ మాదే అధికారం అని అనడానికి: రామ్ మాధవ్..!

మోడీ చరిష్మా చాలు మళ్లీ మాదే అధికారం అని అనడానికి: రామ్ మాధవ్..!
 
2014 ఎన్నికల్లో దేశమంతటా నమో పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ అని ఆ పార్టీ ప్రకటించగానే అప్పటి వరకు దేశంలో ఉన్న లెక్కలు ఒకలా ఉంటే మోడీ పేరును ప్రకటించేసరికి లెక్కలు మొత్తం తారుమారై పోయాయి. దీంతో 2014 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం బిజెపి పార్టీ స్వతంత్రంగా తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అని వస్తున్నా కామెంట్లకు కౌంటర్ వేశారు బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్.
 
ఈ క్రమంలో దేశంలో బిజెపి కన్నా, ప్రధాని నరేంద్ర మోడీనే అదిక పాపులర్ అని అన్నారు. మోడీ సర్కార్ మళ్లీ, మళ్లీ రావాలని ప్రజలు దేశం అంతటా కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. డిల్లీలో తెలుగువారితో ప్రత్యేకంగా ఆయన సమావేశం అయ్యారు.కాశ్మీర్‌లో ఆజాద్‌ హిందూస్తాన్‌... నరేంద్ర మోదీ జిందాబాద్‌ అని నినాదాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రాబల్యం లేని చోట కూడా నరేంద్ర మోదీకి ప్రజాదరణ ఉందన్నారు. వాస్తవంగా బీజేపీ కంటే నరేంద్ర మోదీకే ఎక్కువ పాపులారిటీ ఉందని చెప్పారు.
Top