కేజ్రీవాల్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి..?

Written By Siddhu Manchikanti | Updated: May 05, 2019 11:13 IST
కేజ్రీవాల్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి..?

కేజ్రీవాల్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి..?
 
ప్రస్తుతం దేశ స్థాయిలో జరుగుతున్న ఎన్నికలలో బిజెపి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్నరూ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. ఖచ్చితంగా ఈసారి జరుగుతున్న ఎన్నికలలో మోడీ ని గద్దె దించడానికి జాతీయ నాయకులు చేస్తున్న ప్రయత్నాలలో కేజ్రీవాల్ చాలా చురుగ్గా పాల్గొంటూ జాతీయ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యారు.
 
ఇదిలావుండగా ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కేజ్రీవాల్ పై దాడి చేసినట్లు వార్త వచ్చింది. డిల్లీలో ఆయన రోడ్ షోలో ఉండగా, ఒక వ్యక్తి ఆయన చెంపపై కొట్టాడని సమాచారం.గతంలో కూడా కేజ్రీవాల్ పై ఒకటి , రెండుసార్లు దాడులు జరిగాయి. ఒకసారి ఒక వ్యక్తి ఆయనపై ఇంక్ చిమ్మాడు.ఈ మద్యకాలంలో నేతలపై చెప్పులు వేయడం, ఇలా దురుసుగా వ్యవహరించడం వంటివి జరుగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ఈ ఘటన జాతీయ రాజకీయాలలో పెను సంచలనం సృష్టించింది. మరోపక్క కొంతమంది నాయకులు ఇది బిజెపి పార్టీ పని నాయకులపై చెప్పులు వాడటం వంటివి చేసేవి ఆ పార్టీకి సంబంధించిన వారే అని వ్యాఖ్యానిస్తున్నారు.
Top