ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ప్రధాన పార్టీ నాయకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల పై జరుగుతున్న సర్వేలలో ఎక్కువగా వైసీపీ పార్టీ పై విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు మరియు చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అంతేకాకుండా ఎపిలో టిడిపి గెలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఎన్నికల లో ఎంతో మంది విలన్లను తట్టుకుని నిలబడ్డామని ఆయన అన్నారట. టిడిపి నియోజకవర్గాలవారీగా సమీక్షలను ఆయన ఆరంభించారు.తెదేపాకు వ్యతిరేకంగా మోదీ, కేసీఆర్ అనేక కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రత్యర్ధుల కుట్రలను పోటాపోటీగా ఎదుర్కున్నామని చంద్రబాబు అన్నారు. టిడిపికి నష్టం కల్గించేందుకు కేసీఆర్ కూడా ప్రయత్నించారు. రాష్ట్రంలో జగన్ కుట్రలకు మోదీ, కేసీఆర్ కుతంత్రాలు తోడయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు.