నది లోకి దూసుకెళ్లిపోయిన విమానం…!

Written By Siddhu Manchikanti | Updated: May 05, 2019 11:19 IST
నది లోకి దూసుకెళ్లిపోయిన విమానం…!

నది లోకి దూసుకెళ్లిపోయిన విమానం…!
 
ప్రపంచంలో వరుసగా విమాన ప్రమాదాలు ఇటీవల జరుగుతున్నాయి. దీంతో చాలామంది విమాన ప్రయాణం చేయాలంటే ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. అయితే తాజాగా అమెరికాలో ప్రయాణిస్తున్న విమానంలో భారీ ప్రమాదం నుండి తప్పించుకుంది. అమెరికా దేశంలో ఫ్లోరిడా రాష్ట్రం వద్ద ఈ సంఘటన జరిగింది. క్యూబా నుంచి అమెరికా వస్తున్న బోయింగ్‌ 737 విమానం రన్‌వే నుంచి జారిపోయి నదిలో పడిపోవడంతో అంతా కలవర పడ్డారు.
 
ఆ టైమ్ లో విమానంలో 136 మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు సిబ్బంది ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇరవై మంది కి పైగా గాయపడ్డారని, కాని ఎవరికి ప్రాణాపాయం జరగలేదని సమాచారం. ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లే విమానాశ్రయంలో ల్యాండవుతుండగా అదుపు తప్పిన మియామి ఎయిర్‌కు చెందిన బోయింగ్‌ 737.. రన్‌వేకి సమీపంలో ఉన్న సెయింట్‌ జాన్స్‌ నదిలో పడిపోయింది. అయితే నదిలో మునగకపోవడంతో ప్రమాదం తప్పిందని అదికారులు చెప్పారు. సహాయ చర్యలు సాగుతున్నాయి.
Top