జనసేన వల్ల మనమే నష్టపోయాం అంటున్న టిడిపి..?

Written By Siddhu Manchikanti | Updated: May 05, 2019 11:25 IST
జనసేన వల్ల మనమే నష్టపోయాం అంటున్న టిడిపి..?

జనసేన వల్ల మనమే నష్టపోయాం అంటున్న టిడిపి..?
 
2019 ఏపీ ఎన్నికల ఫలితాలపై చాలా ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు. ఇంకా 18 రోజుల్లో ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒకపక్క బెట్టింగులు జరుగుతుంటే మరోపక్క ఈసారి తమదే అధికారం అని ఏపీ లో ఉన్న ప్రధాన పార్టీల నాయకులు మీడియా ముందు తెగ ఉదర గొడుతున్నారు. అయితే ఎక్కువగా మాత్రం ఓటమి భయం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ స్వతంత్రంగా పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి జరిగిన ఎన్నికల్లో చాలా డ్యామేజ్ జరిగిందని...జనసేన పార్టీని చాలా తక్కువ అంచనా వేశామని తెలుగుదేశం పార్టీ నేతలు అంతర్గత సమావేశాల్లో కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.
 
ఈ నేపథ్యంలో ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో పోలింగ్ సరళి పై చంద్రబాబు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో వెల్లడైన విషయాలను చూసి చంద్రబాబు సైతం ఖంగు తిన్నారంట… జనసేన చాలా వరకు ఓట్లు చీల్చిందని, ఆయితే ఆ ఓట్లు ఏ పార్టీవో తెలియదంటూ చెప్తున్నారు కొందరు నేతలు. కాగా గతంలో జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకి మద్దతు ఇవ్వడం వలన కాపు ఓటర్లందరూ కూడా టీడీపీ వైపు మళ్లారు. కానీ ఈసారి జనసేన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయాయని, అందువలన టీడీపీ పార్టీ చాలా వరకు ఓట్లు కోల్పోతుందని సమాచారం. మొత్తం మీద జరిగిన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన టిడిపి సమీక్ష సమావేశంలో జనసేన పార్టీ వల్ల మనమే నష్టపోయామని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నట్లు టాక్.
Top