Advertisement

ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చిన మరో ఎమ్మెల్యే…!

by Siddhu Manchikanti | May 07, 2019 10:21 IST
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చిన మరో ఎమ్మెల్యే…!

ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చిన మరో ఎమ్మెల్యే…!
 
ప్రస్తుతం దేశ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశ రాజకీయ ముఖచిత్రం క్షణక్షణానికి మారిపోతుంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి చుక్కలు చూపిస్తున్నారు బిజెపి పార్టీ నేతలు. బీజేపీ పార్టీని వేస్తున్న వ్యూహాలకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న నాయకులు కేజ్రీవాల్ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. డిల్లీలో ఆమ్ ఆద్మి పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.
 
మరో ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి , బిజెపిలో చేరారు. కొద్ది రోజుల క్రితం పద్నాలుగు మంది ఆమ్ ఆద్మి పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడానికి సిద్దంగా ఉన్నారని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ వ్యాఖ్యానించగా, మావాళ్లు ఎవరూ వెళ్లరని ఆమ్ ఆద్మి పార్టీ అదినేత కేజ్రీవాల్ ప్రకటించారు. కాని ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే బిజెపిలో చేరగా, తాజాగా రెండో ఎమ్మెల్యే దేవేందర్ బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ వైఖరికి నిరసనగా ఆయన పార్టీ మారినట్లు చెబుతున్నారు. ఎన్నికల వేళ ఆమ్ ఆద్మి పార్టీకి ఇది ఇబ్బంది కలిగించే అంశమే. అయితే బిజెపి పై ఆమ్ ఆద్మి పార్టీ రకరకాల విచిత్రమైన ఆరోపణలు చేస్తోంది. తాజాగా జరిగిన ఈ పరిణామం ప్రస్తుతం జాతీయ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది.


Advertisement


Advertisement

Top