ప్రస్తుతం ప్రపంచంలో వరుస విమాన ప్రమాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా రష్యా రాజదాని మాస్కో లో జరిగిన విమాన ప్రమాదంలో 41 మంది మరణించారు. మాస్కో విమానాశ్రయంలో ఒక విమానం అత్యవసరంగా లాండ్ అవడానికి చేసిన ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని కదనం.
రష్యాకు చెందిన ఎరోఫ్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా దించివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నేలను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. అవి విమానంలోకి వ్యాపించడంతో అందులోని ప్రయాణికులు 41 మంది మరణించారు. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి 78 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. మిగిలిన 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా జరిగిన ఈ ఘటన విమాన ప్రయాణికులకు ఎంతో భయభ్రాంతులకు గురి చేసింది.