Advertisement

రిజల్ట్ రాకముందే జగన్ దగ్గర కర్చీఫ్ వేసే ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ నేతలు..!

by Siddhu Manchikanti | May 07, 2019 10:28 IST
రిజల్ట్ రాకముందే జగన్ దగ్గర కర్చీఫ్ వేసే ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ నేతలు..!

రిజల్ట్ రాకముందే జగన్ దగ్గర కర్చీఫ్ వేసే ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ నేతలు..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడం ఖాయం అని జగన్ ముఖ్యమంత్రి అవుతారని అన్ని సర్వేలు తెలుపుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో గెలిచే గెలుపు గుర్రాలు వైసీపీ పార్టీ లోకి వెళ్లడానికి ప్రయత్నాలు జరుపుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్. ముఖ్యంగా ఇద్దరు టీడీపీ నేతలు తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినవారు ...వైసీపీ పార్టీ లోకి వెళ్ళడానికి ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేశార‌ని తెలుస్తోంది. జగన్ దగ్గర కర్చీఫ్ వెయ్యడానికి వైసీపీ ముఖ్య‌నేత‌ల‌తో సంప్ర‌దిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.
 
ఇక గతంలో జగన్‌తో తమ‌కు ఉన్న సాన్నిహిత్యాలను గుర్తు చేస్తూ.. ఆ ఇద్ద‌రు నేత‌లు తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు రెడీ అంటూ సంకేతాలను పంపుతున్నారట. అయితే అందుకు జ‌గ‌న్ మాత్రం సానుకూలంగా లేర‌ని స‌మాచారం. ఎందుకంటే ఫిరాయించిన నేత‌ల పై జ‌గ‌న్‌కు న‌మ్మ‌కం ఎప్పుడో పోయింది. అందుకే ఎన్నిక‌ల ముందు ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కొందరు తిరిగి వైసీపీలో చేరినా వారికి టిక్కెట్లు ఇవ్వ‌లేదు జ‌గ‌న్. అయితే ప్ర‌స్తుతం గెలుపు వైసీపీదే అని రిపోర్ట్స్ వ‌స్తున్న నేప‌ధ్యంలో మ‌ళ్ళీ ఆ ఫిరాయిరింపు నేత‌ల్ని పార్టీలోకి తీసుకుని అన‌వ‌స‌రంగా కొత్త త‌ల‌నొప్పులు తెచ్చుకోవ‌డం ఎందుక‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది.


Advertisement


Advertisement

Top