చంద్రబాబు- పవన్ రహస్య సమావేశం..?

చంద్రబాబు- పవన్ రహస్య సమావేశం..?

చంద్రబాబు- పవన్ రహస్య సమావేశం..?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎవరికీ అర్థం కాని నేపథ్యంలో 2019 ఏపీ రాజకీయ ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విడిచి స్వతంత్రంగా పోటీ చేసిన విషయం మనకందరికీ తెలిసినదే. అయితే కొన్ని అభ్యర్థుల ఎంపిక విషయంలో మరియు నియోజకవర్గాలలో నిలబెట్టిన జనసేన పార్టీ అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీ కుమ్మక్కు అయిందని తాజాగా జరిగిన ఎన్నికలలో అనేక కామెంట్లు వినబడ్డాయి.
 
ఇదిలా ఉండగా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు రహస్యంగా భేటీ అయినట్లు ఏపీ రాజకీయాలలో టాక్ వినపడుతోంది. తాజాగా జరిగిన ఎన్నికల జ‌న‌సేన వ‌ల్ల వైసీపీ ఓట్ల‌కు గండి ప‌డ‌క‌పోగా టీడీపీ ఓట్లే చీలిపోయాయ‌ని వార్తలు వ‌స్తున్నాయి. టీడీపీ సొంత స‌ర్వేలో కూడా ఇదే విష‌యం తేలింది. దీంతో ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోతే.. వైసీపీని త‌ట్టుకోవ‌డం ఎలా, అస‌లు త‌ప్పు ఎక్క‌డ జరిగింది.. భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ గురించి ఇలా అనేక రాజ‌కీయ విష‌యాల పై చ‌ర్చ‌లు జ‌రిన‌ట్లు స‌మాచారం. వైసీపీ గెలిస్తే.. జ‌గ‌న్‌ను ఎదుర్కొన‌డానికి కొత్త ప్లాన్ వేస్తున్న‌ట్టు టాక్ వినపడుతోంది.Top