2019 సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్. ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ కి పోటీగా వైసీపీ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ కె పోటీ చేశారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరిగిన తర్వాత నియోజకవర్గంలో వాతావరణం చూస్తే ఇద్దరి మధ్య పోటీ చాలా గట్టిగా జరిగినట్లు మంగళగిరి నియోజకవర్గంలో టాక్ వినపడుతోంది. ఇదిలా ఉండగా ఈ నియోజకవర్గంకు సంబంధించి తమిళనాడుకు చెందిన దినమలార్ అనే ఒక సంచిక లోకేష్ రాజకీయ అరంగేట్రంపై ఒక సంచలన కథనాన్ని ప్రచురించారు.
వీరి ప్రతిపాదన ప్రకారం మంగళగిరిలో లోకేష్ ఎలాంటి ప్రభావితం చూపుతారు? అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని వారు కొన్ని అంశాలను వెల్లడించారు. నారా లోకేష్ కు ఇది మొదటి సారి పోటీ కావడం అందులోను వైసీపీకి మంచి పట్టున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి బాబు అతి నమ్మకంతో పోటీలో నిలబెట్టడంతో చినబాబు కి ఎక్కడో భయం ఉండనే ఉందట. అక్కడ గెలుపుపై లోకేష్ కు నమ్మకం కూడా లేదట. లోకేష్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని డబ్బులు కుమ్మరించినా సరే ఓటమి తప్పదని చినబాబు భావిస్తున్నారని ఆ కథనంలో తెలిపారు. మొత్తంమీద చివరి వరకు ఎవరు గెలుస్తారు అన్నది చాలా ఉత్కంఠభరితంగా ఉంది.