సంచలనం రేపుతున్న చంద్రబాబు క్యాబినెట్ భేటీ..!

Written By Siddhu Manchikanti | Updated: May 08, 2019 11:51 IST
సంచలనం రేపుతున్న చంద్రబాబు క్యాబినెట్ భేటీ..!

సంచలనం రేపుతున్న చంద్రబాబు క్యాబినెట్ భేటీ..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం పై కేంద్ర ప్రభుత్వం పై రకరకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా క్యాబినెట్ భేటీలు నిర్వహిస్తున్న చంద్రబాబు తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రజ తాజాగా మరొకసారి ఈనెల పదవ తారీఖున మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేసి మరో వివాదానికి తెరలేపారు చంద్రబాబు.
 
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు సి.ఎస్. ఎల్వి సుబ్రహ్మణ్యానికి నోట్ వచ్చింది. దీనిపై ఆయన అదికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సిఇఓ ద్వివేది, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సాయిప్రసాద్ తదితరులతో మాట్లాడారు. కాగా ఎన్నికల కోడ్ నేపద్యంలో మంత్రివర్గ సమావేశంపై ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని ద్వివేది భావించినట్లు సమాచారం. కాగా తాగు నీటి సమస్య, కరువు, తుపాను సమస్య వంటి అంశాలపై చర్చ పేరుతో చంద్రబాబు నాయుడు ఈ వివాదం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు.
Top