జగన్ పై స్వరం మార్చిన కెఎ పాల్..?

Written By Siddhu Manchikanti | Updated: May 08, 2019 11:59 IST
జగన్ పై స్వరం మార్చిన కెఎ పాల్..?

జగన్ పై స్వరం మార్చిన కెఎ పాల్..?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు సీరియస్ గా రాజకీయాలు చేస్తుంటే మరోపక్క ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఎ పాల్ చేసిన వ్యాఖ్యలు అందరికీ కడుపుబ్బా నవ్వించాయి. ఇటువంటి క్రమంలో ఇటీవల ఎన్నికల అయిపోయిన తర్వాత ప్రజాశాంతి పార్టీ కచ్చితంగా వంద స్థానాలు గెలుస్తుందని కెఎ పాల్ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. అయితే తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తరుణంలో కెఎ పాల్ ఎక్కువగా వైసిపి పార్టీ అధినేత జగన్పైదారుణమైన విమర్శలు చేసేవారు.
 
అంతేకాకుండా జగన్ పార్టీని దెబ్బ కొట్టాలని వైసీపీ పార్టీ కండువా మాదిరిగానే తన పార్టీ కండువా అలాగే వైసిపి పార్టీ ఫ్యాన్ గుర్తు మాదిరిగానే తన పార్టీ గుర్తు హెలికాప్టర్ వుండేలా చూసుకొని జగన్ పార్టీని పాల్ దెబ్బకొట్టాలని చూశారని చాలామంది వైసీపీ పార్టీ నేతలు ఎన్నికల సమయంలో కామెంట్లు చేశారు. ఇంతగా జగన్ పై కక్షగట్టిన కే ఏ పాల్ తాజాగా ఇప్పుడు చంద్రబాబుపై దారుణమైన విమర్శలు చేస్తూ వైసీపీ పార్టీ అధినేత జగన్ తో పని చేయడానికి రెడీగా ఉన్నానని ప్రకటించారు. అంతేకాకుండా ఈ సారి ప్రజాశాంతి పార్టీ 100 సీట్లు గెలుస్తుందని, చంద్రబాబు నిర్వహించిన సర్వేలోనే తేలిపోయిందని అన్నారు. ఈ సారి చంద్రబాబుకు రిటైర్మెంట్ ప్రకటించి, మనమిద్దరం కలిసి పనిచేద్దమంటూ జగన్‌కు పాల్ ఆఫర్ చేశాడట. మొత్తంమీద ఎన్నికల ఫలితాలు ముందు కెఎ పాల్ జగన్పై స్వరం మార్చడం బట్టి చూస్తుంటే పాల్ కి కూడా వైసీపీ పార్టీ గెలుస్తుందని అర్థమైపోయిందని అంటున్నారు వైసిపి పార్టీ నేతలు.
Top