జగన్ మౌనం చూసి బెదిరిపోతున్న టిడిపి నేతలు..?

Written By Siddhu Manchikanti | Updated: May 08, 2019 12:07 IST
జగన్ మౌనం చూసి బెదిరిపోతున్న టిడిపి నేతలు..?

జగన్ మౌనం చూసి బెదిరిపోతున్న టిడిపి నేతలు..?
 
ఎన్నికలు అయిపోయిన నాటినుండి టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ముందు కేంద్ర ఎన్నికల సంఘం పై మరియు కేంద్ర ప్రభుత్వం పై రకరకాల కారణాలు లేవనెత్తుతూ విమర్శలు చేస్తూ కనిపిస్తున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎన్నికల అయిపోయిన నాటినుండి అడపాదడపా చాలా తక్కువ సార్లు మీడియా ముందుకు రావడం జరిగింది. ఎక్కువగా జగన్ ఎన్నికల గురించి గానీ మరియు ఫలితాల గురించి గానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్న నేపథ్యంలో చాలా మంది టీడీపీ నేతలకు టెన్షన్ పట్టుకున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్.
 
అయితే దీనికి కారణం జగన్ తన గెలుపు పై చాలా ధీమాగా ఉండడమే అని అందువల్ల తాను సైలెంట్ గా ఉండి ఇతర పార్టీల్లో టెన్షన్ పుట్టించడమే తాను అనుకున్న విజయానికి మొదటి మెట్టుగా భావిస్తున్నారని కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు. మైండ్ గేమ్ అంటే ఒక్క చంద్రబాబుకు మాత్రమే కాదు జగన్ కి కూడా వచ్చని దీనితో అర్ధమవుతుందని తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి చంద్రబాబు జగన్ ను ఎన్ని మాటలు అంటున్నా సరే జగన్ మాత్రం ఇది వరకటిలా చంద్రబాబును ఒక్క మాట కూడా అనకుండా సైలెంట్ గా ఉంటున్నారు. దీనితో చంద్రబాబుకే అర్ధం కానీ విధంగా జగన్ మైండ్ గేమ్ మొదలుపెట్టరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Top