నటుడు శివాజీ నివాసంలో సోదాలు..!

నటుడు శివాజీ నివాసంలో సోదాలు..!

నటుడు శివాజీ నివాసంలో సోదాలు..!
 
టీవీ9లో తనకు వాటా ఉందంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన నటుడు శివాజీ నివాసంలోనూ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. నారాయణగూడ, హిమాయత్‌ నగర్‌లోని ఆయన నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. కాగా సంస్థకు హాని కలిగించే దురుద్దేశంతో శివాజీతో దురుద్దేశ పూర్వకంగా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా, సంస్థ యాజమాన్యానికి... కంపెనీ నిర్వాహణలో ఇబ్బందులు కల్పించేలా రవి ప్రకాశ్ ప్రయత్నిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన విషయం తెలిసిందే. ఈ కుట్రలో భాగంగా కంపెనీకి చెందిన ముఖ్యమైన డాటాను తస్కరించడమే కాక, కంపెనీకి నష్టం చేసే దురుద్దేశంతో ఆ డేటాను బయటి వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానాలు ఉన్నాయని కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త 2 తెలుగు రాష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది.Top