పశ్చిమబెంగాల్లో ప్రధాని మోడీ పై దారుణమైన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!

Written By Siddhu Manchikanti | Updated: May 10, 2019 10:16 IST
పశ్చిమబెంగాల్లో ప్రధాని మోడీ పై దారుణమైన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!

పశ్చిమబెంగాల్లో ప్రధాని మోడీ పై దారుణమైన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!
 
జాతీయ రాజకీయాలపై ఇటీవల ఎక్కువ దృష్టి పెట్టారు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఈ సారి కనుక కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజాస్వామ్యానికే ప్రమాదమని కామెంట్లు చేసినా చంద్రబాబు బిజెపి పార్టీకి మరియు ప్రధాని మోడీకి దిమ్మతిరిగిపోయే విధంగా ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో కామెంట్లు చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు క‌ర‌గ్‌పూర్‌లో నిర్వ‌హించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్ర‌ధాని స్థాయిలో ఉన్న న‌రేంద్ర మోడీ దేశ ప్ర‌జ‌లను న‌ట్టేట ముంచారని విమ‌ర్శించారు. క‌ళ్ల‌బొల్లి క‌బ‌ర్లు చెప్పి.., అవి చేస్తా.. ఇవి చేస్తానంటూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి అధికారంలోకి వ‌చ్చార‌న్నారు. తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఆధ్వ‌ర్యంలో ప‌శ్చిమ బెంగాల్ అభివృద్ధిలో దూసుకుపోతుంద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌తి ఒక్క‌రు కూడా టీఎంసీకి ఓటు వేయాల‌ని కోరారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని 42 పార్ల‌మెంట్ స్థానాల్లో టీఎంసీని గెలిపించాల‌ని చంద్ర‌బాబు ఆ రాష్ట్ర ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మ‌మ‌తా బెన‌ర్జీ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అయితేనే ప‌శ్చిమ బెంగాల్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. పేద‌రిక నిర్మూల‌న‌, రైతుల‌ను ఆదుకుంటానంటూ చెప్పి అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ ఓట్లేసిన ప్ర‌జ‌ల‌నే న‌ట్టేట ముంచార‌ని చంద్రబాబు విమ‌ర్శించారు.
Top