Advertisement

అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్ పేజీ పై మోడీ పై కథనం…!

by Siddhu Manchikanti | May 11, 2019 14:05 IST
అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్ పేజీ పై మోడీ పై కథనం…!

అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్ పేజీ పై మోడీ పై కథనం…!
 
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అమెరికాకు చెందిన అంతర్జాతీయ మ్యాగజిన్ ప్రధాని మోడీ పై సంచలన వ్యాసాన్ని ప్రచురించింది. ఎన్నికల సమయంలో ప్రదాని మోడీకి ఇది సంతోషం కలిగించే విషయమే. ఇదేదో ఇంకాస్త ముందు వస్తే బిజెపికి ప్రచారానికి బాగా ఉపయోగపడేది. మోడీ - ద రిఫార్మర్ పేరుతో అంతర్జాతీయ మాగజైన్ అమెరికాకు చెందిన టైమ్ కవర్ పేజీ బొమ్మతో వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించింది. భారత్ ప్రతిపక్షాలు ఆయనపై విరుచుకుపడుతున్న తరుణంలో ఈ పత్రిక ఈ వ్యాసం ఇవ్వడం విశేషం.అయితే మోడీకి కూడా ఒక చురక , ఒక పొగడ్త ఉండేలా శీర్షికలు పెట్టింది.
 
కవర్‌ పేజీపై మోదీ ఫొటో పక్కన ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ అంటూ వివాదాస్పద హెడ్‌లైన్‌ రాసింది. దీంతో పాటు ‘మోదీ ది రిఫార్మర్‌’ అనే మరో హెడ్‌లైన్‌ కూడా ఇచ్చింది. ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ కథనాన్ని ప్రముఖ భారత జర్నలిస్టు తవ్లీన్‌ సింగ్‌ కుమారుడు ఆతిష్‌ తసీర్ రచించగా, ‘మోదీ ది రిఫార్మర్‌’ను ప్రముఖ కన్సల్టింగ్‌ సంస్థ యురేసియా గ్రూప్‌ వ్యవస్థాపకుడు ఇయాన్‌ బ్రెమర్‌ రాశారు. బలహీనమైన ప్రతిపక్షం ఉండటం మోదీకి అదృష్టమంటూ రచయిత పేర్కొన్నారు. ఉద్యోగాలు, అభివృద్ధి గురించి మాట్లాడి 2014లో మోదీ అఖండ విజయం సాధించారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాలు మినహా ఇంకేమీ చేయట్లేదని ఈ రచయితలు అభిప్రాయపడ్డారు. అమెరికాలో 2020లో హిల్లరీ క్లింటన్ మళ్లీ పోటీ చేస్తే ఎలా ఉంటుందో ప్రియాంక రాజకీయాల్లోకి రావడం కూడా అలాంటిదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.


Advertisement


Advertisement

Top