లండన్ లో హైదరాబాద్ వాసి దారుణ మృతి..!

Written By Siddhu Manchikanti | Updated: May 11, 2019 14:11 IST
లండన్ లో హైదరాబాద్ వాసి దారుణ మృతి..!

లండన్ లో హైదరాబాద్ వాసి దారుణ మృతి..!
 
ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ ఏ చోట చేసిన యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంటే మరోపక్క దాడులు ప్రమాదాలతో యావత్ ప్రపంచం వణికిపోతుంది. అయితే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఏ దేశంలో కూడా ప్రశాంతత వాతావరణం ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి నగరాలు ప్రమాదకరంగా మారుతున్నట్లు ప్రస్తుత పరిస్థితులు బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల ఇంగ్లాండ్ రాజదాని లండన్ లో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. అతను హైదరాబాద్ వాసి అని గుర్తించారు.
 
నజీనుద్దీన్ అనే ఈ యువకుడు లండన్ టెస్కో సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు. ఆ మార్కెట్ లోని సెల్లార్ లో అతనిని ఒక దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. అతని సహోద్యోగే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా నజీరుద్దీన్ కుటుంబ సభ్యులు లండన్ వెళ్లేందుకు గాను ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తగు సహకారం ఇవ్వాలని వారు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ ను కోరుతున్నారు.
Top