జగన్ పవర్ లోకి వస్తాడేమో అని తెగ భయపడిపోతున్నారు వారు…?
రెండు తెలుగు రాష్ట్రాలలో ఓ వర్గానికి చెందిన మీడియా ముందు నుండి వైయస్ జగన్ ని టార్గెట్ చేస్తూ పిచ్చి పిచ్చి కథనాలు రకరకాల చెడు వార్తలు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాసే మీడియా ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈ మీడియా చానళ్లను పత్రికలను వైసీపీ పార్టీ నేతలు ఎల్లో మీడియా అని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావటం ఖాయమని పలు సర్వేలు చెబుతున్న నేపథ్యంలో అధికార పార్టీ టీడీపీకి గత కొంత కాలం నుండి కొమ్ముకాసిన ఎల్లో మీడియా తెగ భయపడిపోతున్నటు టాక్.
గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఈ ఎల్లో మీడియా ప్రతిపక్షాలపై అనవసర ఆరోపణలు చేస్తూ, టీడీపీ చేస్తున్న తప్పుడు పనులను మాత్రం కప్పిపుచ్చుతూ తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేసేది. దీనిపై జగన్ ప్రచారంలోనే ప్రజలకు గట్టిగానే చెప్పాడు. జగన్ తన ఎన్నికల ప్రచారంలో కూడా సదరు ఛానల్ ల పేర్లను పత్రికల పేర్లను ప్రస్తావిస్తూ లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా అబద్ధాలు చెబుతారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జగన్ అప్పట్లోనే పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కచ్చితంగా వైసీపీ పార్టీ గెలవడం ఖాయం అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఎల్లో మీడియా తెగ భయపడిపోతున్నటు టాక్ వినపడుతోంది.