చంద్రబాబు పై దారుణమైన కామెంట్స్ చేసిన లక్ష్మీపార్వతి..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలవడం ఖాయం అని వార్తలు వస్తున్న నేపథ్యంలో దివంగత ఎన్టీఆర్ భార్య వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీపార్వతి ఇటీవల మాట్లాడుతూ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు అని పేర్కొన్నారు. అంతేకాదు వైసీపీ గెలిచిన వెంటనే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని దీనిని ఎవరు ఆపలేరని కూడా ఆమె అన్నారు.
అయితే చంద్రబాబు రాజకీయ జీవితం ఇంతటితో ముగిసిపోతుందని, ఇక ఆయన తట్ట బుట్ట సర్ధుకుని పోవడాం మంచిదని కూడా చెప్పారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న టీడీపీ ప్రతిష్టను చంద్రబాబు నాశనం చేశారని, ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేశారని అందుకే ప్రజలు ఈ సారి మార్పు కోరుకుని జగన్ వైపు నిలబడ్డారని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే నాపై కావాలనే అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని, ఇలాంటి కుట్రలు ఎన్ని పన్నినా నాకున్న గౌరవ, మర్యాదలు ఎప్పుడూ తగ్గవని, నేను ఏదైనా తప్పు చేస్తేనే కదా భయపడేది అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.