ఫుల్ క్లారిటీ తో ఉన్న పవన్ కళ్యాణ్..!

Written By Siddhu Manchikanti | Updated: May 13, 2019 10:12 IST
ఫుల్ క్లారిటీ తో ఉన్న పవన్ కళ్యాణ్..!

ఫుల్ క్లారిటీ తో ఉన్న పవన్ కళ్యాణ్..!
 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్నికలలో ఇటీవల పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గాలలో ఎంత మెజార్టీ వస్తుందని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ వేసిన ప్రశ్న కి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు మెజారిటీ తో సంబంధం లేదని తన పని తాను చేసుకుని వెళ్ళిపోతాను అని పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని అంటున్న పవన్ కళ్యాణ్...తన పార్టీని అదే దిశగా నడిపిస్తున్నారు.
 
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పార్టీ విజయావకాశాలు, పోలింగ్ సరళిపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై వార్తలు వచ్చాయి. వచ్చే స్తానిక ఎన్నికల నాటికి ప్రతి గ్రామంలో పార్టీ పటిష్టం చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఇందుకోసం గ్రామ స్థాయి సమస్యలపై దృష్టి పెట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పనిచేయాలని నేతలకు పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారని సమాచారం. పలువురు తమ ఎన్నికల అనుభవాలను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి వివరించారు. మొత్తంమీద చూసుకుంటే భవిష్యత్ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీ తో ఉన్నట్లు తెలుస్తోంది.
Top