అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లిపోయావు రవి ప్రకాష్ అని సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి…!

Written By Siddhu Manchikanti | Updated: May 13, 2019 10:16 IST
అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లిపోయావు రవి ప్రకాష్ అని సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి…!

అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లిపోయావు రవి ప్రకాష్ అని సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి…!
 
టీవీ9 రవి ప్రకాష్ ఫోర్జరీ కేస్ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఈ కేసు విషయమై జాతీయ స్థాయిలో కూడా చాలామంది నేతలు తెలుగు మీడియా రంగంపై వివిధ రకాలుగా కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్.పి విజయసాయిరెడ్డి టివి 9 మాజీ సిఈఓ రవిప్రకాష్ పై వ్యంగ్యాస్త్రాలు సందించారు.రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్తలపై ఆయన స్పందించారు.
 
‘మెరుగైన సమాజ ఉద్యమకారుడు శుక్రవారం మధ్యహ్యం 3గంటల నుంచి ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేశాడట. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి వెళ్తే ఈ నెల 23వ తేదీ తర్వాత దొరికే ప్రమాదం ఉండటంతో కర్ణాటక మీదుగా ముంబాయి చేరినట్టు సమాచారం. నన్నెవరూ టచ్ చేయలేరని బీరాలు పలికి పరారీలో ఎందుకున్నావు ప్రవక్తా?’ అంటూ ట్వీట్‌ చేశారు. రవిప్రకాష్ శనివారం మద్యాహ్నం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారని, సెల్ పోన్ స్విచాఫ్ చేశారని పలు మీడియా ఛానల్ లో వార్తలు రావడంతో వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Top