అందుకే చంద్రబాబు ‘మహానాడు’ పెట్టడం లేదు…?

Written By Siddhu Manchikanti | Updated: May 13, 2019 10:20 IST
అందుకే చంద్రబాబు ‘మహానాడు’ పెట్టడం లేదు…?

అందుకే చంద్రబాబు ‘మహానాడు’ పెట్టడం లేదు…?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో త్రిముఖ పోటీ ఉన్నా గాని ఎక్కువగా వైసిపి టిడిపి పార్టీ ల మధ్య ఎక్కువ పోటీ ఉన్నట్లు సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానాడు జరగాల్సి ఉండగా చంద్రబాబు వాయిదాల మీద వాయిదాలు వేసినట్లు దాని వెనుక గల కారణం జరిగిన ఎన్నికలలో వైసిపి పార్టీ గెలవడం ఖాయం అని బాబు గారికి కూడా అర్థం అయినట్లు మరియు టిడిపి పార్టీకి సంబంధించిన ఎన్నారై ఎమ్మెల్యే చేసిన సర్వేలో కూడా ఇదే విషయం చేరడంతో చంద్రబాబు ఏపీలో జరగాల్సిన మహానాడును పెట్టడం లేదన్న వార్తలు బలంగా వినబడుతున్నాయి.
 
ముఖ్యంగా ఈ విషయం చంద్రబాబు కి పోలింగ్ జరిగిన తర్వాతే తెలిసిపోయినట్లు...ఇందుమూలంగానే ఓటమి బురదను తప్పించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం పై మరియు ఈవీఎంలపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఏపీ ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని విపక్ష పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపు ఎఫెక్ట్ టాక్ టీడీపీ మహానాడు కి బలంగా తాకిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Top