జగన్ దే అధికారం అంటున్న ఐఏఎస్ లు…!

Written By Siddhu Manchikanti | Updated: May 13, 2019 10:29 IST
జగన్ దే అధికారం అంటున్న ఐఏఎస్ లు…!

జగన్ దే అధికారం అంటున్న ఐఏఎస్ లు…!
 
ఇంకో 10 రోజుల్లో ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారా లేక పోతే జగన్ ముఖ్యమంత్రి అవతార అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇలా ఉండగా తాజాగా ఇటీవల కొంతమంది ఐఏఎస్ అధికారులు వైఎస్ జ‌గ‌న్‌తో, వైసీపీ ముఖ్య నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు విస్తృత‌స్థాయి ప్ర‌చారం జ‌రుగుతోంది. వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే కీల‌క పోస్టులు ద‌క్కించుకునేది ఎవ‌రు..? అన్న అంశంపై విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.
 
ఇటీవ‌ల ప‌లు స‌ర్వే సంస్థ‌లు విడుద‌ల చేసిన ఏపీ ఫ‌లితాల ప్ర‌కారం వైఎస్ జ‌గ‌న్ సీఎం అయితే ఆయ‌న పేషీలోకి ఎవ‌రు వెళ‌తారు..? అత్యంత కీల‌క శాఖ‌ల‌ను ఎవ‌రికి అప్ప‌గిస్తారు..? కొత్త సీఎం కేబినేట్ ఎలా ఉండ‌బోతుంది..? అన్న ప్ర‌శ్న‌ల‌పై అమ‌రావ‌తి వేదిక‌గా విస్తృత స్థాయి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు స‌ర్కార్‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ఎల్వీ సుబ్ర‌హ్మణ్యం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చినా కూడా కొన‌సాగుతార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తం మీద ఐఏఎస్ల హడావిడి చూస్తుంటే కచ్చితంగా ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఆల్రెడీ గెలిచినట్లు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
Top