హీరో శివాజీ హైదరాబాద్ ఖాళీ!

Written By Siddhu Manchikanti | Updated: May 14, 2019 10:03 IST
హీరో శివాజీ హైదరాబాద్ ఖాళీ!

హీరో శివాజీ హైదరాబాద్ ఖాళీ!
 
టీవీ9 ఫోర్జరీ కేసు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఈ కేసు విషయమై రవి ప్రకాష్ మరియు నటుడు హీరో శివాజీ పై పలురకాల ఆరోపణలు మరియు వార్తలు ఇటీవల రావడం జరిగింది. ఈ దెబ్బతో రవి ప్రకాష్ ని టీవీ9 కొత్త యాజమాన్యం సంస్థ నుండి తొలగించగా ఇప్పుడు అదే రీతిలో శివాజీ కూడా పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. టీవీ9 లో పెట్టిన వాటాల ద్వారా ఈ టాలీవుడ్ నటుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రస్తుతం పోలీసుల విచారణకు దర్యాప్తు హాజరవుతున్నారు.
 
అయితే ఇటీవల పోలీసుల విచారణకు సరిగ్గా హాజరు కావడం లేదని శివాజీ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు శివాజీ హైదరాబాదులో లేరని ఈ కేసు విషయమై ఎప్పుడైతే మీడియాలో హైలెట్ వార్తలు రావడంతో తన మకాం మొత్తం అమరావతికి మార్చేసినట్లు ఇటీవల కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి. టీవీ9 వాటాల వివాదం నేపథ్యంలో - అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఇచ్చిన ఫిర్యాదుతో మళ్లీ తెరమీదకు వచ్చారు. ఈ ఫిర్యాదుపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఏప్రిల్ 24 - 30 తేదీల్లో రెండు ఎఫ్ ఐఆర్ లు నమోదుచేశారు. ఈ రెండు ఎఫ్ ఐఆర్ లకు సంబంధించి నమోదైన ఆరోపణలపై 160 సీఆర్పీసీ కింద దర్యాప్తు అధికారి.. రవిప్రకాశ్తోపాటు నటుడు శివాజీ - టీవీ 9 మాజీ సీఎఫ్ వో మూర్తికి నోటీసులు జారీచేశారు.
 
మూర్తి ఒక్కరే స్పందించి మూడురోజులుగా పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరిస్తున్నారు. రవిప్రకాశ్ - శివాజీ మాత్రం ఇంతవరకు హాజరుకాలేదు. రవిప్రకాశ్ - శివాజీ పదిరోజుల గడువు కోరినప్పటికీ.. దర్యాప్తులో తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వారికి అంత సమయం ఇచ్చే అవకాశంలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసును తెలంగాణ పోలీసులు టేకప్ చేస్తున్న నేపథ్యంలో మరిన్ని ఇబ్బందులు భవిష్యత్తులో వస్తాయని ఏపీలో అయితే కచ్చితంగా ఎటువంటి దాడి జరిగే అవకాశం లేదని శివాజీ హైదరాబాద్ ఖాళీ చేసి అమరావతి పోయినట్లు సమాచారం.
Top