చంద్రబాబు ఇంటి పక్కనే కబ్జా? ఇంతకంటే దారుణమైన న్యూస్ ఉంటుందా?

Written By Siddhu Manchikanti | Updated: May 14, 2019 10:06 IST
చంద్రబాబు ఇంటి పక్కనే కబ్జా? ఇంతకంటే దారుణమైన న్యూస్ ఉంటుందా?

చంద్రబాబు ఇంటి పక్కనే కబ్జా? ఇంతకంటే దారుణమైన న్యూస్ ఉంటుందా?
 
2014 ఎన్నికల్లో విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇష్టం వచ్చినట్లు అవినీతికి తెగబడి రాష్ట్రాన్ని అన్ని విధాలా నష్ట పోయేలా చేసిందని ప్రతిపక్ష పార్టీలు గత ఐదు సంవత్సరాలు తెగ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మొత్తం చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందని లోకేష్ కూడా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రకాల అవినీతి లో వాటాలు తీసుకుంటున్నారని బాధ్యతగల పదవిలో ఉండి ప్రజల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆడుకుంటుంది అంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు గత కొంత కాలం నుండి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
 
ముఖ్యంగా రాష్ట్రంలో ఇసుక, బొగ్గు..ఇంకా అనేక రకాల వాటిలో టిడిపి ప్రభుత్వం విచ్చలవిడి అవినీతికి పాల్పడిందని కామెంట్లు తరచూ వినిపిస్తూ ఉండేవి. వీటిని పక్కనపెడితే.. తాజాగా మరో అవినీతి బట్టబయలైంది. ముఖ్యమంత్రి నివాసానికి అతి సమీపంలో ఉన్న కృష్ణా నదిని కబ్జా చేశారు. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బయటపెట్టారు. అయితే ఇది ప్రైవేటు వ్యక్తి పేరు మీద ఉన్నదని నీటి పారుదల అధికారులు చెబుతున్నారు. గతంలోనూ కృష్ణా నది ఒడ్డున కబ్జా చేశారు. ఇసుక బస్తాలను వేశారు. అప్పుడు కూడా వైసీపీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే బస్తాలను మాత్రం తొలగించారు. ఇప్పుడేమో కబ్జా కాలేదు అని వాళ్లే చెబుతున్నారు. దీంతో అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు సీఎం ఇంటి సమీపంలోనే జరగడంతో - ఇందులో టీడీపీ నేతల హస్తం ఉందన్న దానికి బలం చేకూరుతోంది.




Top