ఇది వెన్నుపోటు మహారాజు చంద్రబాబుకే భారీ వెన్నుపోటు?

Written By Siddhu Manchikanti | Updated: May 14, 2019 10:09 IST
ఇది వెన్నుపోటు మహారాజు చంద్రబాబుకే భారీ వెన్నుపోటు?

ఇది వెన్నుపోటు మహారాజు చంద్రబాబుకే భారీ వెన్నుపోటు?
 
ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అని చాలామంది పెద్దలు అప్పట్లో అంటుండేవారు. ఇప్పుడు ఇదే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కి జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీని స్థాపించ్చిన నందమూరి తారక రామారావు గారికి చంద్రబాబు దారుణంగా వెన్నుపోటు పొడిచారని పార్టీని తన చేతుల్లోకి లాక్కున్నారని ఇప్పటికీ చాలామంది చంద్రబాబు అంటే గిట్టని వారు అంటుంటారు. అయితే ఇక విషయానికొస్తే ఇటీవల ఏపీలో పోలింగ్ అయిపోయిన తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీతో కలుస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
 
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పై జాతీయ రాజకీయాల్లో మోడీ కానీ మిగతా వారు ఎవరైనా ఏమైనా అన్నా అని కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే ఎక్కువగా చంద్రబాబు రియాక్ట్ అయ్యి కౌంటర్లు వేస్తున్నారు. ఇంతగా కాంగ్రెస్ పార్టీపై ప్రేమ చూపిస్తున్న చంద్రబాబుకి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఊహించని విధంగా వెన్నుపోటు లాంటి షాక్ ఇచ్చింది. చంద్రబాబు ని పక్కన పెడుతూ జగన్ పై ప్రేమ చూపించడానికి రెడీ అయింది కాంగ్రెస్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ జగన్ కు టచ్ లోకి వెళ్లిందని జగన్ దగ్గరకు తన దూతలను కూడా పంపిందని నేషనల్ మీడియా కోడై కూస్తోంది. జగన్ ఆ విషయంలో ఒకే మాట చెప్పారని.. 'ఫలితాలు వెల్లడి అయిన తర్వాత చూసుకుందాం..' అని జగన్ తేల్చి చెప్పినట్టుగా ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద ఈ పరిణామాలు చంద్రబాబుకి వెన్నుపోటు లాంటి పరిణామమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Top