మాయావతి - చంద్రబాబు పేరు చెప్తే మాయం అవుతోంది ?

Written By Siddhu Manchikanti | Updated: May 14, 2019 10:12 IST
మాయావతి - చంద్రబాబు పేరు చెప్తే మాయం అవుతోంది ?

మాయావతి - చంద్రబాబు పేరు చెప్తే మాయం అవుతోంది ?
 
ఏపీ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికలలో చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అందుకే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇటీవల ఏపీ లో జరిగిన ఎన్నికల తీరుపై కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే విధంగా జాతీయస్థాయిలో కీలకంగా మారాలని చూస్తున్న చంద్రబాబు మాటలను కూడా జాతీయ స్థాయి నాయకులు మమతా బెనర్జీ మాయావతి లు నమ్మడం లేదని..కాంగ్రెస్ పార్టీ అనుచరుడిగా దూతగా చంద్రబాబు నేషనల్ పాలిటిక్స్లో వ్యవహరిస్తున్నారని మమతా మాయావతి లు అంటున్నట్లు జాతీయ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.
 
ముఖ్యంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి చంద్రబాబు ఏదైనా సమావేశం నిర్వహించాలని చూసిన చంద్రబాబు ఆ సమావేశానికి హాజరవుతున్నారని తెలిసిన మాయావతి రావడంలేదని చంద్రబాబు పేరు చెబితేనే భయపడుతున్నట్లు ఢిల్లీ వర్గాలలో వినపడుతున్న టాక్. దీనికి గల కారణం బాబు పక్కా కాంగ్రస్ ఏజెంట్ లా పని చేస్తున్నాడని రాహుల్ ను తమ భుజాల మీదకు ఎత్తడానికి బాబు ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు సమక్షంలో ఏ సభ జరిగిన...ఆ సభకు మాయావతి వెళ్లకూడదని నిశ్చయించుకున్నట్లు సమాచారం.
Top