బాబు కి జాతీయ స్థాయి లోనే పవర్ పంచ్ ఇచ్చిన కెసిఆర్?

Written By Siddhu Manchikanti | Updated: May 14, 2019 10:15 IST
బాబు కి జాతీయ స్థాయి లోనే పవర్ పంచ్ ఇచ్చిన కెసిఆర్?

బాబు కి జాతీయ స్థాయి లోనే పవర్ పంచ్ ఇచ్చిన కెసిఆర్?
 
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ టిడిపి అధినేత చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లు ఆ సమయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. దీంతో కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ పై చాలా కామెంట్లో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో వినబడ్డాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం జాతీయ స్థాయిలో కీలకం కావాలని చేస్తున్న చంద్రబాబు నాయుడికి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిమ్మతిరిగిపోయే పవర్ పంచ్ ఇచ్చినట్లు జాతీయ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో గద్దె దించాలని ఇప్పటికే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ నాయకులకు వారి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు చంద్రబాబు.
 
ఇలా జాతీయస్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాబు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడు. అయితే కేసీఆర్ బాబు ప్రాధాన్యతను తగ్గించి చేస్తున్నాడు. ఇప్పటికే సీపీఎం జేడీఎస్ వాళ్లతో కేసీఆర్ టచ్లోకి వెళ్లాడు. అలాగే మమతా బెనర్జీకి కూడ కేసీఆర్ టచ్లో ఉన్నాడు. డీఎంకేతో కూడా అనుకున్న మీటింగును సాధిస్తున్నాడాయన. ఇలా కలవడం వల్ల వాళ్లతో ఫలితాల అనంతరం చర్చలకు కేసీఆర్ కు సులభం అవుతుంది. సదరు పార్టీ నేతలను ఏ కూటమి వైపుకు తీసుకు వెళ్లాలన్నా కేసీఆర్ కు అందరితోనూ యాక్సెస్ ఉన్నట్టువుతుంది. చంద్రబాబుకు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో తెలీదు. కేసీఆర్ మాత్రం 15 ఎంపీ సీట్ల విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ విధంగా టిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ తెగ భుజాలు తడుముకునే చంద్రబాబుకి జాతీయ స్థాయిలో ప్రస్తుతం తనకు అనుకూలంగా ఉన్న రాజకీయ వాతావరణాన్ని ఉపయోగిస్తూ కెసిఆర్ చంద్రబాబుకి బీభత్సమైన పవర్ పంచ్ లు వేస్తున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Top