మీరేం భయపడక్కర్లేదు అంటున్న చంద్రబాబు..?

Written By Siddhu Manchikanti | Updated: May 15, 2019 13:11 IST
మీరేం భయపడక్కర్లేదు అంటున్న చంద్రబాబు..?

మీరేం భయపడక్కర్లేదు అంటున్న చంద్రబాబు..?
 
వచ్చే ఆదివారం మే 19 వ తారీకు ఎగ్జిట్ పోల్స్ రానున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ మంత్రులకు ఎగ్జిట్ పోల్స్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు అంటూ హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పోలింగ్ ప్రక్రియ మరియు రాబోతున్న ఫలితాల విషయంలో ఇటీవల చంద్రబాబు నాయుడు మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఎగ్జిట్ పోల్స్ ప్రస్తావనకు వచ్చిందట.
 
తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించేలా,గందరగోళ పరిచేలా ఎగ్జిట్ పోల్స్ వచ్చినా కంగారు పడవద్దని ఆయన సూచించారట.టిడిపి గెలుస్తుందని ఆయన అన్నారట. మోదీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అంశాలను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సీఎంకు వివరించారు. మోదీ విధానాలను జాతీయ స్థాయిలో పూర్తిగా ఎండగట్టలేకపోయారని ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. ఎన్డీయేకు ఎట్టిపరిస్థితుల్లోనూ గెలుపు అవకాశాలు కన్పించడంలేదని చంద్రబాబు అనగా.. ఒకవేళ వచ్చినా మోదీని తప్పిస్తారనే ప్రచారం జరుగుతోందని ఓ మంత్రి సీఎం వద్ద అన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజ్‌నాథ్‌ సింగ్‌, గడ్కరీకి అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోందని మరో మంత్రి అన్నట్టు అన్నారట.
Top