మహానాడు ను రద్దు చేసుకున్న టిడిపి..!

Written By Siddhu Manchikanti | Updated: May 15, 2019 13:14 IST
మహానాడు ను రద్దు చేసుకున్న టిడిపి..!

మహానాడు ను రద్దు చేసుకున్న టిడిపి..!
 
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది మహానాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మే నెలాఖరులో నిర్వహిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈనెలాఖరులో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. అయితే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.ఆర్.జయంతిని ఘనంగా అన్ని గ్రామాలలో నిర్వహించాలని నిర్ణయించారు.
 
పార్టీ ముఖ్య నేతలతో పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 23న ఎన్నికల ఫలితాలు రానుండడం, జాతీయ రాజకీయాలలో చంద్రబాబు బిజిగా ఉండబోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాయి. అయితే మరో పక్క విపక్ష పార్టీలు మాత్రం చంద్రబాబు నాయుడికి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం తెలిసింది కాబట్టి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించకుండా జాతీయ రాజకీయాలు అంటూ డ్రామాలు ఆడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.
Top