హైదరాబాదుకు చెందిన యువకుడు అమెరికాలో మృతి..!

Written By Siddhu Manchikanti | Updated: May 15, 2019 13:18 IST
హైదరాబాదుకు చెందిన యువకుడు అమెరికాలో మృతి..!

హైదరాబాదుకు చెందిన యువకుడు అమెరికాలో మృతి..!
 
ఇటీవల ఇటువంటి సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. మొన్న లండన్ నగరంలో హైదరాబాదుకు చెందిన ఒక యువకుడు మృతి అందరికి షాక్ కి గురి చేస్తే తాజాగా ఆ సంఘటన మరువకముందే మరొక సంఘటన సేమ్ అటువంటిదే జరగటం ఇప్పుడు అందరికీ భయభ్రాంతులకు గురి చేసింది. ముఖ్యంగా తమ పిల్లలను విదేశాల్లో చదివించాలని చూస్తున్నా తల్లిదండ్రులకు ఇటువంటి వార్తలు వింటుంటే తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
 
విదేశాలకు వెళ్లిన మన పిల్లలు ఏదో కారణంతో మరణిస్తే తల్లిదండ్రులకు ఎంత కష్టం. అమెరికాలోని నార్త్ కరొలినా లో కారు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు ఒకరు మరణించిన విషాద ఘటన జరిగింది. సోహిత్ రెడ్డి అనే ఈ యువకుడు అమెరికాకు ఎమ్.ఎస్.చేయడానికి వెళ్లాడు. అక్కడ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తల్లిదండ్రులు,కుటుంబ సభ్యలు కన్నీరు మున్నీరు అవుతున్నారు.వారు నల్లకుంటలోని పద్మా కాలనీలో నివాసం ఉంటున్నారు.
Top