మోడీ భార్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన మాయావతి..!

Written By Siddhu Manchikanti | Updated: May 15, 2019 13:20 IST
మోడీ భార్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన మాయావతి..!

మోడీ భార్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన మాయావతి..!
 
జాతీయ రాజకీయాలలో మోడీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేతల లో ఒకరు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ప్రస్తుతం దేశ స్థాయిలో జరుగుతున్న ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని ఎలాగైనా దించాలని భద్ర శత్రువు పార్టీ సమాజ్వాదీ పార్టీతో చేతులు కలపడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో బీజేపీ పై మోడీ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికల వేడిని పెంచుతున్నారు మాయావతి. ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి మాయావతి ప్రధాని మోడీ పై దారుణమైన కామెంట్స్ చేసినట్లు జాతీయ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.
 
రాజకీయ ప్రయోజనాల కోసం సొంత భార్యనే వదిలేసిన వ్యక్తి.. ఇతరుల అక్కాచెల్లెళ్లను, భార్యలను ఏ విధంగా గౌరవిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ప్రశ్నించారు. బీజేపీలోని మహిళా నేతలు తమ భర్తలు మోదీ వద్దకు వెళ్తుంటే ఆందోళన చెందుతున్నట్టు నాకు తెలిసింది. మోదీలాగే తమ భర్తలు కూడా తమను వదిలేస్తారని వారు భయపడుతున్నారు అని మాయావతి వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తికి (మోదీకి) ఓటు వేయొద్దని మహిళలకు ఆమె సూచించారు. మోదీ భార్యకు వారిచ్చే అసలైన గౌరవం కూడా ఇదేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీంతో మాయావతి చేసిన కామెంట్లు ఇది జాతీయ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.
Top