ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రోజు నుండే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం పై రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన తీరు పై ఈవీఎంలపై ఇలా అనేక విధాలుగా రకరకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విన్న ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు ఓటమి భయంతోనే చంద్రబాబు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో దళితులు ఓట్లు వేయకుండా ఒక సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం వారు అడ్డుకున్నారన్న అబియోగాలపై ఎన్నికల కమిషన్ స్పందించి రీపోలింగ్ కు ఆదేశాలు ఇచ్చినా మీరు పై చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు సమాచారం.
సిసి టీవీ పుటేజీ ఆదారంగా ఎన్నికల కమిషన్ రీపోలింగ్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా ఎన్నికల సంఘం ఏకపక్ష దోరణి అని చంద్రబాబు విమర్శిస్తున్నారు అట. దీనిపై ఆయన లేఖ కూడా రాశారట. నిబందలను ఎన్నికల సంఘమే ఉల్లంఘిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. టిడిపి చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులను మాత్రమే ఈసీ పరిగనణలోకి తీసుకుందని దుయ్యబట్టారు. తొమ్మిది చోట్ల రీపోలింగ్ జరపాలని తాము ఫిర్యాదు చేస్తే.. వాటిని కనీసం పట్టించుకోలేదన్నారు. భాజపా, దాని మిత్ర పక్షాల ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తోందని విమర్శించారు.