కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై సంచలన కామెంట్స్ చేసిన నేషనల్ పార్టీ లీడర్..!
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించడంతో వెంటనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ బిజెపి రెండు జాతీయ పార్టీలు దేశంలో లేకుండా ఉండాలని.. అప్పుడే దేశం బాగు పడే అవకాశం ఉందని ఆ సమయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నారు.
ఇందుకు అనుగుణంగా కెసిఆర్ జాతీయ స్థాయిలో ఉన్న చాలా మంది నాయకులను ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం కోసం కలవడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫెడరల్ ప్రంట్ ను ఎవరూ నమ్మరని సిపిఐ ప్రదాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ఐదేళ్లుగా బిజెపికి కెసిఆర్ మద్దతు ఇచ్చారని ఆయన విమర్శించారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసినా, కాంగ్రెస్, బిజెపి లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ పరిరక్షణకోసం బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడే కూటమికి మద్ధతు ఇవ్వాలని ఆయన కోరారు. పెడరల్ ప్రంట్ లో వామపక్షాలు కూడా కలవాలని కెసిఆర్ కేరళ వెళ్లి సిపిఎం ముఖ్యమంత్రి విజయన్ ను కలిశారు. ఈ నేపద్యంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.