సీఎం అయ్యాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా అంటున్న జగన్..?

సీఎం అయ్యాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా అంటున్న జగన్..?

సీఎం అయ్యాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా అంటున్న జగన్..?
 
ఏపీ లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు వైసీపీ పార్టీ నేతలు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో వైసీపీ పార్టీ గెలవడం ఖాయమని జగనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ అధినేత జగన్ కి కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చినట్లు తాజాగా ఇటీవల పులివెందుల లో చేసిన వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవల జగన్ పులివెందుల పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా పులివెందుల లో నిర్వహించిన ప్రజాదర్బార్లో జగన్ మాట్లాడుతూ..ఎపి లో అధికారంలోకి రాబోతున్నామని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
 
తాను ముఖ్యమంత్రి అవుతానని, ప్రజలకు అండగా ఉంటానని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని ఆయన అన్నట్లు సమాచారం. ఇటీవల పులివెందులలో పర్యటించిన జగన్ ఉదయం నుంచి రాత్రి వరకు జగన్‌ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. కడపతోపాటు అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరికి చేయూతనందిస్తానని ఈ సందర్భంగా జగన్‌ హామీ ఇచ్చారు. వైకాపా ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అంజద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మొత్తం మీద వైసిపి పార్టీ అధినేత జగన్ రాబోయే పోలింగ్ ఎన్నికల ఫలితాలలో తమ పార్టీ గెలవడం ఖాయం అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.Top