తాజాగా జరిగిన రీపోలింగ్ లో కూడా దుమ్ముదులిపిన వైసీపీ పార్టీ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఇటీవల జరిగిన ఎన్నికలలో ఇప్పటికే వైసిపి పార్టీ గెలవడం ఖాయం అనే ఆలోచనలో ఏపీ ప్రజలు మరియు ఆ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు. ఏ సర్వే చూసినా ఏ పార్టీ చేసిన ఏ నాయకుడు చేసిన సర్వేలలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావటం గ్యారెంటీ అని తేలడంతో ఏపీ ప్రజలు జగన్ నీ ముఖ్యమంత్రిగా పిక్స్ అయిపోయినట్లు చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన రీపోలింగ్ లో పరిణామాలను బట్టి తెలుస్తుంది. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన రీపోలింగ్ లో వైసిపి పార్టీ దుమ్ము దులిపేసినట్లు సమాచారం.
ఈ నియోజకవర్గంలో ఎక్కువగా దళితులు ఉన్న నేపథ్యంలో గత సారి జరిగిన పోలింగ్ సమయంలో టిడిపికి చెందిన నాయకులు నియోజకవర్గం పై దాడికి పాల్పడడంతో దాడికి సంబంధించిన విజువల్స్ కెమెరాలో చిత్రీకరణ జరగటంతో ఎన్నికల కమిషన్ ఈ నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించడం జరిగింది. అయితే తాజాగా జరిగిన రీపోలింగ్ లో ఆ నియోజకవర్గానికి చెందిన ప్రజలు తమపై గతంలో దాడికి పాల్పడిన టీడీపీ నేతలకు బుద్ధి వచ్చేటట్లు నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఓట్లు మొత్తం గంపగుత్తగా వైసీపీ పార్టీ కి వేసినట్లు ఆ నియోజకవర్గం లో వినపడుతున్న టాక్. దీంతో చంద్రగిరి నియోజకవర్గంలో కూడా వైసిపి పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం అనే టాక్ ఏపీ రాజకీయాల్లో వినబడుతుంది.