చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి మరొక శాఖ బలి?

Written By Siddhu Manchikanti | Updated: May 18, 2019 10:12 IST
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి మరొక శాఖ బలి?

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి మరొక శాఖ బలి?
 
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కి ఉన్నంత పబ్లిసిటీ పిచ్చి మరి ఎవరికి ఉండదని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు అంటుంటారు. ముఖ్యంగా చంద్రబాబుకి ఉన్నంత మీడియా ఫాలోయింగ్ మరే పొలిటిషన్ కి లేదని చాలా రాజకీయ నేతలు కామెంట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్టీసీ బస్సులను నవ్యాంధ్ర రాజధాని అమరావతి చూడటానికి మరియు పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి ఉచితంగా బస్సులను ఏర్పాటు చేసి వాటిలో విద్యార్థులను రాష్ట్ర ప్రజలను సందర్శించే విధంగా అడుగులు వేయడం జరిగింది.
 
అయితే చంద్రబాబు చేసిన ఈ పనికి ఏపీఎస్ఆర్టీసీ ఇప్పుడు దారుణమైన నష్టాల్లోకి వెళ్లినట్లు సమాచారం. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల కోసం పోలవరంకు ఫ్రీగా బస్సులు ఏర్పాటుచేసింది ఆర్టీసీ. అలా 65 కోట్ల 80లక్షల రూపాయల అదనపు భారం పడింది. ఈ మొత్తాన్ని చెల్లించడానికి చంద్రబాబు మనసు అంగీకరించడం లేదు. ఇప్పటికే 6000 కోట్ల రూపాయల ఆర్థిక కష్టాల్లో ఉంది ఆర్టీసీ. అలాంటి సంస్థకు అదనంగా మరో 65 కోట్ల భారం వేసి ఎంచక్కా సైడ్ అయిపోతున్నారు బాబు. యాజమాన్యం అడిగితే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కదా అని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు చేసిన పనికి పబ్లిసిటీ పిచ్చికి రవాణా శాఖ బలి అయిపోయిందనే వార్తలు వినబడుతున్నాయి.
Top