ఆరు రోజుల్లో కౌంటింగ్: లెక్కలు ఎలా ఉన్నాయ్?

Written By Siddhu Manchikanti | Updated: May 18, 2019 10:20 IST
ఆరు రోజుల్లో కౌంటింగ్: లెక్కలు ఎలా ఉన్నాయ్?

ఆరు రోజుల్లో కౌంటింగ్: లెక్కలు ఎలా ఉన్నాయ్?
 
ప్రస్తుతం ఏడు దశల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు త్వరలో ముగియనున్న నేపథ్యంలో మరి ఆరు రోజుల్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానున్న క్రమంలో జాతీయస్థాయిలో లెక్కలు అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే జాతీయ పార్టీలకు రెండిటికీ కూడా కచ్చితంగా స్పష్టమైన మెజార్టీ స్థానాలు రావడం అసంభవమని చాలా సర్వేలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా రెండు జాతీయ పార్టీలు ఇష్టమొచ్చినట్లు ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు.
 
ముఖ్యంగా దేశంలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తున్నాయో తెలుసుకొని ఆ పార్టీ కార్యాలయం బయట రెండు జాతీయ పార్టీలకు చెందిన రాయబారులు సదరు ప్రాంతీయ పార్టీల అధ్యక్షుల వైపు దీనంగా చూడటం మొదలు పెట్టే కార్యక్రమం ఇటీవల ప్రారంభించడం జరిగింది. మొత్తంమీద దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు లెక్కల బట్టి చూస్తుంటే బీజేపీకి కనీసం 200 స్థానాలు రావడం ఖాయమని అంటున్నారు చాలామంది పొలిటికల్ విశ్లేషకులు. అలాగే కాంగ్రెస్ కూడా గత సార్వత్రిక ఎన్నికల కంటే మరింతగా ప్రాంతీయ పార్టీలను కలుపుకొని మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వెళ్లడం ఖాయమనే కామెంట్లు కూడా వినబడుతున్నాయి.
Top