ఏపీ కి కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంటున్న పీపుల్స్ పల్స్ సర్వే…!
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో సర్వే చేస్తూ తనప్రత్యేకత నిలబెట్టుకుంటున్న సర్వే సంస్థ పీపుల్స్ పల్స్ ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 112 సీట్లు వస్తాయని ఏపీ కి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అంచనా వేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ 59 స్థానాల్లో గెలుపొందే అవకాశమున్నట్లు తెలిపింది. ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించవచ్చునని పేర్కొంది.
అలాగే వైఎస్సార్‌సీపీ 18 నుంచి 21 స్థానాలు గెలిచే అవకాశముందని, టీడీపీకి 4 నుంచి 6 స్థానాలు వస్తాయని చెప్పింది. వైఎస్సార్‌సీపీకి 45.4 శాతం ఓట్లు, టీడీపీకి 42.3 శాతం, జనసేనకు 8.4 శాతం, ఇతరులకు 3.9 శాతం ఓట్లు రావచ్చునని వెల్లడించింది. వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ ఖాతా తెరవక పోవచ్చునని, అలాగే జనసేనకు 10 జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాకపోవచ్చునని సర్వే ద్వారా చెప్పింది. జనసేనకు పశ్చిమ గోదావరిలో రెండు, తూర్పుగోదావరి, విశాఖపట్నంలో ఒక్కో సీటు గెలిచే అవకాశముందని ఆ సంస్థ సర్వేలో తేలింది.