కేంద్రంలో మళ్లీ ఎన్.డి.ఎ.నే అదికారం చేపట్టవచ్చని మెజార్టీ సర్వేలు వెల్లడిస్తున్నాయి. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వేలు అబిప్రాయపడుతున్నాయి. యుపిలో బిజెపికి కొన్ని సీట్లు తగ్గినా, మరీ ప్రమాదకర స్తాయిలో తగ్గడం లేదని తేల్చాయి.
మీడియా సంస్థ:
ఎన్డీయే:
యుపిఎ
ఇతరులు:
టైమ్స్‌నౌ
306
132
104
రిపబ్లిక్ టీవీ సీ ఓటర్
287
128
127
రిపబ్లిక్ టీవీ జన్ కీ బాత్
315
124
113
న్యూస్ ఎక్స్
242
162
136
న్యూస్ నేషన్
282-290
118-126
130-138
ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్
300
127
115
టుడేస్ చాణక్య
340
70
133
వీడీపీ అసోసియేట్స్
333
115
94
యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్ లేకపోవడం బీజేపీకి కలిసివచ్చినట్టుగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయేకు పట్టం కట్టాయి. ఇక టైమ్స్‌నౌ ఎన్డీయేకు 306 స్ధానాలు, యూపీఏకు 132 స్ధానాలు, ఇతరులకు 104 స్ధానాలు దక్కుతాయని అంచనా వేసింది. రిపబ్లిక్ సీ ఓటర్ ఎన్డీయేకు 287 , యూపీఏకు 128 స్ధానాలు, ఇతరులకు 127 స్ధానాలు లభిస్తాయని పేర్కొంది.
రిపబ్లిక్ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు 315 స్ధానాలు, యూపీఏకు 124 స్ధానాలు, ఇతరులకు 113 స్ధానాలు రావచ్చని అంచనా వేశాయి. మరోవైపు న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయేకు 298 స్ధానాలు, యూపీఏకు 118 స్ధానాలు, ఇతరులకు 126 స్ధానాలు లభించనున్నాయి. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయేకు స్ధానాలు, యూపీఏకు స్ధానాలు, ఇతరులకు స్ధానాలు దక్కనున్నాయి. ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్‌లో ఎన్డీయేకు 300, యూపీఏకు 127, ఇతరులకు 115 స్ధానాలు రావచ్చని అంచనా వేసింది.